Thursday, December 19, 2024

ఆన్‌లైన్ గేమ్‌కు యువకుడు బలి

- Advertisement -
- Advertisement -

నెక్కొండ : ఆరుగాలం కష్టించి పండించిన పంట ధాన్యం డబ్బులు బ్యాంకు ఖాతాలో ఉండగా వాటితో ఆన్‌లైన్ గేమ్ ఆడి మోసపోయిన యువకుడు మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన నెక్కొండ మండలం అప్పల్‌రావుపేటలో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెక్కొండ మండలం అప్పల్‌రావుపేట గ్రామానికి చెందిన కమలాకర్, స్వప్న దంపతులకు ఇద్దరు కుమారులు. రెండవ కుమారుడు ఉదయ్(19) వ్యవసాయం చేస్తూ చదువుకుంటున్నాడు. ఇటీవల చేతికొచ్చిన వరి ధాన్యాన్ని అమ్మగా ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం తల్లి స్వప్న బ్యాంకు ఖాతాలో రూ.50వేలు జమ అయ్యాయి. ఫోన్‌లో రూ.యాబై వేల బ్యాలెన్స్ ఉండటంతో ఉదయ్‌కి ఆన్‌లైన్ గేమ్‌పై ఆశ పెరిగి ఆన్‌లైన్ గేమ్ ఆడారు.

శుక్రవారం రాత్రి వరకు రూ.నలబై వేల డబ్బు ఆన్‌లైన్ గేమ్‌కు రూ.నలబై వేలు కట్ కావడంతో షాక్‌కు గురైన ఉదయ్ తల్లిదండ్రులకు తెలిస్తే ఏమవుతుందోనని భయంతో అతను ఉన్న గదిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు గమనించి బోరున విలపించడంతో గ్రామస్తులు వచ్చారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు జరిగిన పొరపాటుకు చేతికొచ్చిన కొడుకు కానరాని లోకాలకు పోవడంపై బోరున విలపించారు. ఉదయ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానిక పోలీసులు శవపంచనామ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా బిఆర్‌ఎస్ జెడ్పీ ప్లోర్ లీడర్ పెద్ది స్వప్న విషయం తెలుసుకొని ఉదయ్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఓదార్చుతూ జరిగిన సంఘటనపై విచారాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News