Wednesday, January 22, 2025

ప్రభుత్వ ఉద్యోగానికి తండ్రి ఒత్తిడి..యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కోటా : ప్రభుత్వోద్యోగం ఆ 20 ఏండ్ల యువకుడికి జీవితకాలం లేటయ్యింది. సర్కారీ ఉద్యోగం కావాలని ఆశించి నీరసించి విఫలమైన తన్వీర్ ఖాన్ అనే యువకుడు తన రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన రాజస్థాన్‌లో కోటాలోని కృష్ణ విహార్ కాలనీలో జరిగింది. కున్హారీ ప్రాంతంలో ఈ యువకుడు తండ్రి, తన చెల్లెలుతో కలిసి నివసిస్తున్నాడని, బుధవారం మధ్యాహ్నం ఆయన ఉరేసుకుని వేలాడుతూ చనిపోయి ఉండగా గుర్తించారని స్థానిక డిఎస్‌పి కివ్ సింగ్ రాథోడ్ గురువారం తెలిపారు. ఆయన గది నుంచి ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా తెలిపే లేఖ ఏదీ దొరకలేదు. ఈ యువకుడి విషాదాంతానికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనేది ఆరాతీస్తున్నామని ఈ పోలీసు అధికారి చెప్పారు.

ఇప్పటికైతే ఈ యువకుడు ఉద్యోగం రాలేదనే బాధతోనే మృతికి పాల్పడినట్లు వెల్లడయినట్లు వివరించారు. స్థానికంగా తన నివాసంలోనే ఉంటూ ఈ యువకుడు పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నాడు. ఏ కోచింగ్ సెంటర్‌లో చేరలేదు. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌కు చెందిన వీరి కుటుంబం ఈ మధ్యనే కోటాకు వచ్చింది. ఇంటర్మీడియట్ పాసైన ఖాన్‌కు ఇటీవలే ఓ ప్రైవేటు కంపెనీలో మంచి వేతనంతో ఉద్యోగం వచ్చింది. అయితే కొడుకు ప్రభుత్వోద్యోగం సంపాదించాలని కోరుకున్న తండ్రి ఈ ఉద్యోగంలో చేరనివ్వలేదని వెల్లడైంది. మృతుడి తండ్రి ఇక్కడ ఓ కోచింగ్ సెంటర్‌లో కెమిస్ట్రి లెక్చరర్‌గా ఉన్నారు. కోచింగ్ సెంటర్ల కోటాలో విద్యార్థులు పోటీపరీక్షల ఒత్తిడితో మానసిక వేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్న క్రమంలో ఇప్పుడు జరిగిన ఈ ఆత్మహత్యోదంతం యువతరం మానసిక బలహీనతను మరో కోణంలో స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News