Wednesday, January 22, 2025

ఆన్​లైన్ బెట్టింగ్..అప్పులు తీర్చలేక యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఆన్​లైన్ బెట్టింగ్ లో నష్టపోయిన యువకుడు అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనా సూర్యపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని నెహ్రు నగర్ కి చెందిన తడకమళ్ల సాయికుమార్ మూడు సంవత్సరాల క్రితం బిటెక్ పూర్తి చేశాడు. తన బాబాయ్ తో కలిసి కిరాణ షాప్ నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఆన్ లైన్ లో బెట్టింగ్ పెట్టి రూ. 2 కోట్ల వరకు నష్టపోయాడు. చేసిన అప్పులు తీర్చలేక మనస్థాపం చెందిన సాయి కుమార్ ఈ నెల 17న ఇంటి నుంచి వెళ్లి పోయాడు.

తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేయగా పోలీసులకు హాలియా వద్ద సాగర్ ఎడమ కాల్వ కట్టపై సాయి కుమార్ బైక్, మొబైల్ ఫోన్ ను కనుగొన్నారు. కాగా సోమవారం పెన్ పహడ్ మండలం దోసపహడ్ వద్ద సాగర్ ఎడమ కాల్వలో సాయి కుమార్ మృతదేహాం లభ్యమైంది. చేసిన అప్పులు తీర్చ లేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సాయి కుమార్ మొబైల్ సెల్ఫీ విడియో తీసినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News