- Advertisement -
ఖమ్మం: కుటుంబ కలహలతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామానికి చెందిన గురుస్వామి(20) కుటుంబ కలహాలతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృత దేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -