Thursday, January 23, 2025

మద్యం మత్తులో పురుగుల మందు తాగి యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్: మండలంలోని బురుగూడ గ్రామానికి చెందిన లోనరే సురేష్ 30 మద్యానికి బానిసై పురుగుల మందు తాగి అత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం సురేష్ ప్రతి రోజు మద్యం తాగి ఇంట్లో డబ్బుల కోసం గోడవ పడుతుండేవాడని, శుక్రవారం రోజు లాగే మద్యం తాగి అదే మత్తులో రాత్రి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడని అన్నారు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ అసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల లోని ఓ ప్రవేట్ అసుపత్రిలో చికిత్స పొందుతూ అదివారం రాత్రి మృతి చెందాడని తెలిపారు. మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తూ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News