Friday, December 20, 2024

ప్రేమించిన అమ్మాయి దూరమైందని యువకుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ప్రేమించిన అమ్మాయి దూరమైందని మనస్తాపం చెంది ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని కంచనపల్లి గ్రామంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసు లు, కుటుంబీకుల కథనం ప్రకారం…గ్రామానికి చెందిన చౌదరిపేట మల్లేశం కుమారుడు చౌదరిపేట అంజనేయులు(22) సంవత్సరన్నర క్రితం పంజాబ్ రాష్ట్రంలో ప్రయివేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో మెదక్ జి ల్లా చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయమై ప్రేమగా మారింది. గత మూడు నెలలుగావీరి ప్రేమ ప్రయాణం కొ నసాగింది. రెండు వారాల క్రితం ఇరువురు ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్లి విషయం ఇరువురి ఇళ్లలో తెలవడంతో పరారయ్యారు.

దీంతో వారం క్రితం కౌడిపల్లి పోలీస్ స్టేషన్‌లో రాగా ఇరు కుటుంబాల తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. దీంతో అమ్మాయి వారి తల్లితండ్రులు వెంబడి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అంజనేయులు బుధవారం ఇంట్లో అమ్మకు పొలంవద్దకు వెళ్లి వస్తాననిచెప్పి వెళ్లి అక్కడే ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. మృతుడి తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఒక్కగానోక్క కొడుకు చిన్నవయసులో మృతిచెందడం తో తల్లితండ్రుల రోదనలు మిన్నంటాయి. దీంతో కంచనపల్లి గ్రామంలో వి షాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News