Saturday, April 5, 2025

యువకుడి ప్రేమ పెళ్లి…. యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: పెళ్లి చేసుకుంటానన్న యువకుడు మరో పెళ్లి చేసుకోవడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలులోని ఇందిరాగాంధీ నగర్‌లో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం…. మార్చి 9న పద్మావతి అనే యువతికి, పాతకోటకు చెందిన వినోద్ కుమార్‌తో నిశ్చితార్థం కుదుర్చుకున్నారు. మే 10న ఇద్దరికి పెళ్లి చేయాలని ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు ఒప్పందం చేసుకున్నారు. సోమవారం వినోద్ కుమార్ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో పద్మావతి మనస్తాపానికి గురి కావడంతో పాటు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: కనిపించని నాలుగో సింహం కెసిఆర్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News