Sunday, December 22, 2024

యువకుడి ఆదృశ్యం

- Advertisement -
- Advertisement -

కన్నతల్లి మందలించటంతో మనస్థాపానికి గురైన ఓయువకుడు ఇంటినుంచి బయటకు వెళ్లి ఆదృశ్యమైన సంఘటన బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బోయిన్‌పల్లి ఎస్‌ఐ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకా రం… తాడ్‌బంద్‌కు చెందిన ముదావత్ సంతోష్ (27) గత నాలుగు సంవత్సరాలుగా ఓస్టాక్ మార్కెట్ ట్రైనిం గ్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. సంతోష్ పనిచేస్తు న్న సంస్థలో వస్తున్న డబ్బులను ఇవ్వకుండా ట్రేడింగ్ లో పెట్టుబడులు పెడుతు పలుమార్లు నష్టపోయాడు.

దీంతో పెట్టుబడికి పలుమార్లు తెలిసిన వ్యక్తుల ద్వారా డబ్బులు తీసుకున్నాడు. గత నెల 30న అలా డబ్బులు ఇతరుల వద్ద అప్పుగా తీసుకోవద్దని ఉద్యోగాన్ని మానివేయాలని తల్లి మందలించటంతో మనస్థాపానికి గురై న అతను సెల్‌ఫోన్‌ను కిందకొట్టి ఇంట్లో నుంచి వెళ్లిపో యి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో సంతోష్ తల్లి తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News