Friday, December 20, 2024

భాగ్యనగరంలో మరో కిరాతకం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తను ప్రేమించిన అమ్మాయిని ఇష్టపడుతున్నాడని, తన ప్రేమకు అడ్డొస్తున్నాడని, ఓ యువకుడు తన స్నేహి తుడిని దారుణంగా చంపిన ఘటన మరవక ముందే మరో కిరాతక ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది మరో యువకుడు తన స్నేహితుడి చేతిలో బలయ్యాడు. కాకపోతే ఇక్కడ కారణం ప్రేమ, ప్రేయసి కాదు పాతకక్షలు, ఆర్థిక లావాదేవీలేనని చెబుతున్నారు. భాగ్యనగర్ శివారు బాలాపూర్‌లో అదృశ్యమైన యువకుడి కేసు విషాదాంతంగా ముగిసింది. ఆ యువకుడు దారుణ హత్యకు గురవ్వడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. భాగ్యనగరం ఉస్మాన్ సాగర్‌కు చెందిన జాఫర్ కుమారుడు మహ్మద్ షా ఫైసల్ ఈ నెల 12వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో నుండి ఉస్మానియా హోటల్‌కు వెళ్లాడు. ఇంట్లో నుండి వెళ్లిన యువకుడు అర్ధరాత్రి దాటినా ఇంటికి తిరిగి రాలేదు.

చాలా ఆలస్యం కావడంతో అతడికి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వారు కంగారు పడ్డారు. అక్కడిక్కడ వెతికారు. తెలిసిన చోట్ల ఉన్నాడేమో అని వెతికారు కుటుంబసభ్యులు. ఎంత వెతికినా జాఫర్ ఆచూకీ లభించలేదు. ఇక లాభం లేదనుకుని ఫైజల్ తండ్రి జాఫర్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో హత్య జరిగినట్లు పోలీసులకు సమా చారం అందింది. ఈ హత్య చేసింది ఫైసల్ స్నేహితుడు జబ్బార్ అని చెబుతున్నారు. మృతుడు, నిందితుడు కలిసి ఇద్దరూ ఒకే చోట పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఫైసల్‌ను జబ్బార్ అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. పైసల్‌పై కర్రలు, రాళ్లతో దాడి చేసి జబ్బార్ హత్య చేశాడని, ఆనక ఫైసల్ తలను, మొండెన్ని వేరు చేశాడు. అనంతరం శరీర భాగాలను షాహిన్ నగర్ లో పడేశాడు. హత్య జరిగిన రెండు వారాల తర్వాత తీవ్రమైన దుర్గంధం రావడంతో స్థానికులు దాని గురించి పోలీసులకు సమాచారం అందించారు.

స్థానికుల నుండి సమాచారం రాగానే పోలీసులు షాహిన్ నగర్ లోని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఫైసల్ మొండెం కనిపించింది. దుస్తుల ఆధారంగా ఆ మొండెం ఫైసల్‌గా గుర్తించారు పోలీసులు. అయితే ఫైజల్ తల మాత్రం ఇంకా దొరకలేదు. ఫైసల్ తలను ఎక్కడ పడేశాడు, ఎలాంటి పరిస్థితిలో అతడి తన ఉందన్న విషయం గురించి పోలీసులు గాలింపు చేపట్టారు. మృతుడికి దాదాపు 6 నెలల క్రితం వివాహం జరిగిందని తెలిపారు. చేతికొచ్చిన కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. నిందుతులను ఎవరైనా కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హత్యకు కారణాలపై పోలీసుల విచారణ
ఈ హత్యోదంతంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఫైసల్ మొండెన్ని పోస్టుమార్టం చేసేందుకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే జబ్బార్ ఫైసల్ ను ఎందుకు చంపాడు, ఎంతో పగ ఉంటే తప్పా ఇంత కిరాతకంగా చంపరు, వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరి గాయి అనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు. మిత్రులు, పరిచయస్తులు, ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండే వారిని విచారిస్తున్నారు. ఫైసల్ ను ఫిబ్రవరి 12వ తేదీనే కిడ్నాప్ చేసి, అదే రోజు హత్య చేసి మొండెన్ని షాహిన్ నగర్ లో, తలను మరో చోట పడేసి ఉంటాడని పోలీసులు అంచనాకు వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News