Monday, December 23, 2024

షిర్డికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : షిర్డికి అని వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. బోయిన్‌పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….బోయిన్‌పల్లి చిత్తారెడ్డి కాలనీకి చెందిన ప్రశాంత్ (26) ఎర్రగడ్డలోని బజాజ్ షోరూంలో సేల్స్‌బాయ్‌గా విధులను నిర్వర్తిస్తున్నాడు. కాగా ఆరు రోజుల క్రితం తాను షిర్డికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరాడు. దాదాపు వారం రోజులు కావస్తున్న ఇంటికి తిరిగి రాకపోగా ఫోన్‌ సైతం చేయలేదు. తాను సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో తాను వైజాక్‌లో ఉన్నట్లు పోస్ట్‌ కనిపించింది. పలుమారు ఫోన్ చేసిన స్పందించపోవటంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు శుక్రవారం బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News