Sunday, December 22, 2024

రూ.500 బెట్టింగ్… యువకుడి తలతో పోలీస్ స్టేషన్‌కు

- Advertisement -
- Advertisement -


దిస్‌పూర్: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో బెట్టింగ్ యువకుడి ప్రాణాలు తీయడమే కాకుండా తలతో నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన సంఘటన అస్సాంలోని సొనిత్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించారు. మ్యాచ్ జరుగుతున్నప్పడు తునిరామ్ అనే యువకుడు బోయిలా హెమ్‌రామ్ తో రూ.500 బెట్టింగ్ చేశాడు. హెమ్ రామ్ మద్దతు ఇచ్చిన టీమ్ గెలవడంతో డబ్బులు ఇవ్వాలని తునిరామ్ ను అడిగాడు. డబ్బులు లేవని చెప్పడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో పదునైన కత్తి తీసుకొని హెమ్ రామ్ మెడపై వేటు వేశాడు. మొండెం నుంచి తలను వేరు చేశాడు. అనంతరం అతడి తలతో 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న రంగాపారా పోలీస్ స్టేషన్‌లో తునిరామ్ లొంగిపోయాడు. హెమ్‌రామ్ సోదరుడు కూడా ఘటనా స్థలంలోనే ఉన్నాడు. పట్టుకునేందుకు ప్రయత్నించినప్పుడు తునిరామ్ తప్పించుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News