Thursday, January 23, 2025

బాలిక నోట్లో యాసిడ్ పోసి… గొంతు కోసి….

- Advertisement -
- Advertisement -

Sixteen-year-old girl raped in Rajanna Sirisilla

 

అమరావతి: తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం చేస్తుండగా ప్రతిఘటించడంతో ఆమె నోట్లో, ముఖంపై యాసిడ్ పోసి గొంతు కోసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  తల్లిదండ్రులు పనుల నిమిత్తం బయటకు వెళ్లడంతో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. నాగరాజు అనే యువకుడు ఇంట్లోకి చొరబడి అత్యాచారం చేయబోయాడు. ఆమె వెంటనే తప్పించుకొని బాత్రూమ్‌లో వెళ్లింది. అక్కడ అత్యాచారం చేయబోతుండగా ఆమె ప్రతిఘటించడంతో ఆమె నోట్లో, ముఖంపై యాసిడ్ పోశాడు. అనంతరం గొంతు కోసి పారిపోయాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు అక్కడి చేరుకొని బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News