Friday, November 15, 2024

యువతి ఇంటికి వచ్చి తలుపుతట్టిన పోకిరి… అత్యాచారయత్నం

- Advertisement -
- Advertisement -

Young man rape attempt on women

హైదరాబాద్: తల్లితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నానని, తనకు లొంగిపోవాలని లేకుంటే చంపేస్తానని బెదిరించి ఆమె కూతురుపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి ప్రయత్నించిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసుఫ్‌గూడలో జరిగింది. దీంతో యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నవీన్ అనే వ్యక్తి(29) గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తూ రహ్మత్‌నగర్‌లో నివసిస్తున్నాడు. గత రెండేళ్ల నుంచి ఓ విద్యార్థిని లైంగికంగా వేధిస్తున్నాడు. పలుమార్లు ఆ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు.

తనతో లైంగిక సంబంధం పెట్టుకోకుంటే నీ పెళ్లి కాకుండాచేస్తానని బెదిరించాడు. ఆదివారం యువతి ఇంటికి వెళ్లి తలుపుతట్టగా ఆమె తీయలేదు. ఆమె 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. యువతి తల్లితో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ సదరు యువకుడు ప్రచారం చేస్తున్నాడని పోలీసులకు తెలిపింది. పోలీసులు నవీన్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నవీన్‌ది ఖమ్మం జిల్లా వైరా మండలం గండగలపాడు గ్రామంగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News