మనతెలంగాణ, హైదరాబాద్ : వరుసకు సోదరైన యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….కర్ణాటక రాష్ట్రానికి చెందిన నిఖిల్(27) టైలర్ పనిచేస్తున్నాడు. తరచూ నగరంలోని ఫిలిం నగర్లో ఉంటున్న తన సొంత చిన్నమ్మ ఇంటికి వస్తుండేవాడు. ఆమె కుమార్తె(27) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతోంది. తరచూ ఇంటికి వస్తున్న నిఖిల్ పిన్ని కూతురుపై కన్నువేశాడు. ఎలాగైనా ఆమేపై అత్యాచారం చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇంట్లో లేని సమయంలో వచ్చిన నిఖిల్, యువతి ఒక్కతే ఉండడంతో కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. అతి తాగిన యువతి స్పృహ కోల్పోయింది. దీంతో నిందితుడు యువతిపై అత్యాచారం చేశాడు. తర్వాత మెలకువ వచ్చిన యువతి తనకు జరిగిన దారుణం గురించి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారితో కలిసి వచ్చి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఎస్సై రవిరాజ్ దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.