Monday, December 23, 2024

సంగారెడ్డిలో విషాదం

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి : ఆన్‌లైన్‌లో ఇన్వెస్ట్ చేసి మోసానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి పట్టణ పరిధిలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ టెలిగ్రామ్ లో వచ్చిన లింక్ ఓపెన్ చేసి వర్క్ ప్రమ్ హోం ఎంచుకున్న అరవింద్(30) అనే యువకుడు ఆన్‌లైన్ మోసానికి బలయ్యాడు. పట్టణ పరిధిలోని గొల్లగూడెంలో నివాసముండే అరవింద్ అనే యువకుడు ముందుగా కొన్ని టాస్క్‌లకు 200 ఇన్వెస్ట్ చేస్తే 250 పంపించిన సైబర్ నేరస్తులు ఆశ చూపించారు.

అధిక డబ్బులు వస్తాయని ఆశతో రూ.12 లక్షల వరకు ఆన్‌లైన్‌లో బెట్టింగ్ పెట్టిన అరవింద్ ఆ తర్వాత టాస్క్ లు కంప్లిట్ చేసిన సైబర్ నేరస్తులు స్పందించకపోవడంతో మోసపోయినట్లు తెలుసుకున్నాడు. మృతుడు అరవింద్‌కు గత మూడు నెలల క్రితం వివాహం అయింది. వచ్చే నెల 5న అరవింద్ చెల్లె పెళ్లి ఉండటంతో ఇంట్లో ఖర్చులకు ఇచ్చిన డబ్బులను వాడుకున్న అరవింద్ అప్పులు తీర్చలేక చెల్లి పెళ్లికి వాడుకున్న డబ్బులు దొరకక బుధవారం సాయంత్రం సంగారెడ్డి పట్టణ పరిధిలోని గొల్లగూడెంలోనీ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News