Thursday, April 3, 2025

పోక్సో కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా న్యాయమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం…చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకాపురంలో ఉంటున్న కాసర్ల మహేష్ అలియాస్ బన్నీ కూలీ పనిచేస్తున్నాడు. నిందితుడి ఇంటిపక్కన ఉంటున్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉండడంతో నిందితుడి వెళ్లి అసభ్యంగ ప్రవర్తించాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులు వచ్చిన తర్వాత చెప్పింది. దీంతో వారు చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి సాక్షాలు సేకరించి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు కోర్టులో సాక్షాలను ప్రవేశపెట్టడంతో వాటిని పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధించింది. బాధితురాలికి రూ.5లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News