Saturday, November 16, 2024

హత్య కేసులో యువకుడికి జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యవతిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష, రూ.50వేల జరిమానా విధిస్తూ ఎల్‌బి నగర్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. మద్దిపట్ల దివ్య ఇంజనీరింగ్ చేసిన సమయంలో తన మామయ్య ఇంట్లో ఉంది. యువతి తల్లిదండ్రులు ఉద్యోగ రిత్యా కోల్‌కతాలో ఉంటున్నారు. అనంతాటి శేఖర్(24) ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. దివ్యను ప్రేమించే వాడు, ఇది వన్ సైడ్ లవ్. ఈ క్రమంలోనే దివ్య తన స్నేహితులతో ఉండడాన్ని నిందితుడు భరించ లేక పోయేవాడు. తనకు దివ్య దక్కదని ఆగ్రహంతో ఉన్న నిందితుడు తనను ఎలాగైన చంపాలని ప్లాన్ వేశాడు.

సెప్టెంబర్ 19-2010లో నిందితుడు ఫోన్ చేసి తన ఇంటిలో పార్టీ ఏర్పాటు చేశానని రావాలని చెప్పడంతో దివ్య  వెళ్లింది. అతడి ఇంటికి వెళ్లిన దివ్య ఫోన్‌ను తీసుకున్న శేఖర్ దానిని పరిశీలించాడు. స్నేహితులు పంపించిన మెసేజ్‌లపై ప్రశించాడు. వాటిని చూసిన నిందితుడు ఆగ్రహంతో బేస్‌బాల్ బ్యాట్‌తో దివ్య తలపై కొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సాక్షాలు సేకరించిన అప్పటి ఇన్స్‌స్పెక్టర్ రవీందర్ రెడ్డి కోర్టులో ప్రవేశపెట్టాడు. వాటిని పరిశీలించిన కోర్టు నిందితుడికి శిక్ష విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News