- Advertisement -
హైదరాబాద్: పెండింగ్ చలాన్లు చెల్లించమన్నందుకు ఓ యువకుడు బైక్ కి నిప్పు పెట్టిన సంఘటన హైదరాబాద్ లోని శంషాబాద్ ఆర్ జిఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళ వారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ఎండీ ఫసియోద్దీన్ శంషాబాద్ లో నివాసముంటున్నాడు. అతని బైక్ పై రూ.9000 చలాన్లు
పెండింగ్ లో ఉన్నాయి.మంగళవారం పోలీసుల తనిఖీల్లో అతను పట్టుబడటంతో పెండింగ్ చలాన్లు చెల్లించాలని ఆదేశించారు. దీంతో అతడు తన ద్విచక్ర వాహనానికి నిప్పు అంటించాడు. గమనించిన పోలీసులు వెంటనే మంటలు ఆర్పివేశారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -