Tuesday, January 21, 2025

నా కుక్కలనే ఢీ కొడతారా అంటూ.. పోలీసులపైకి దూసుకెళ్లిన యువకుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నా కుక్కలనే ఢీ కొడతారా అంటూ పోలీసులపై యువకుడి బూతులు తిట్టిన సంఘటన హైదరాబాద్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు గురువారం చోటుచేసుకుంది. పెట్రోలింగ్ కార్ నెంబర్-2 సిబ్బంది విధుల్లో భాగంగా రోడ్లపై గస్తీ చేస్తున్నారు. అదే సమయంలో ప్రణయ్ అనే యువకుడు తన 2 పెంపుడు కుక్కలతో అదే దారిలో వెళ్తున్నాడు.

కుక్కలకు పెట్రోలింగ్ కారు అడ్డుగా రావడంతో కుక్కలను ఢీకొట్టారంటూ ప్రణయ్ ఆగ్రహంతో పోలీసులను ఇష్టానుసారం దూషించాడు. అంతే కాకుండా కారుకు అడ్డంగా నిలబడ్డాడు. దీంతో అతనిని మరో పోలీసులు సముదాయించిపక్కకు పంపడంతో కారు ముందుకు కదిలించింది. ఈ తతంగాన్ని రోడ్డపై ఉన్న వారందరూ వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకోవడంతో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News