Sunday, December 22, 2024

హైదరాబాద్‌లో నడుస్తున్న బస్సు కింద పడుకున్న యువకుడు

- Advertisement -
- Advertisement -

సోషల్ మీడియాలో గుర్తింపు కోసం యువత కొన్నిసార్లు ప్రాణాలకు తెగించి సాహసాలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో నడుస్తున్న బస్సు కింద నిలువుగా యువకుడు పడుకుని తిరిగి లేచాడు. ఇలా సోషల్ మీడియాలో గుర్తింపు కోసం యువత తమ జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రీల్స్ కోసం యువతీయువకులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాహసాలు చేస్తుండడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సిటీ బస్సు వస్తుండగా ఎదురెళ్లిన యువకుడు ఒక్కసారిగా రోడ్డుపై బస్సు కింద పడుకున్నాడు. అయితే, అతడు నిలువుగా పడుకోవడంతో బస్సు టైర్లు అతడిపైకి ఎక్కలేదు. బస్సు వెళ్లిపోగానే అతడు మామూలుగా లేచి పక్కకి వచ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

అయితే వీడియోపై తెలంగాణ రాష్ట్ర ఆర్టీసి ఎండి సజ్జన్నార్ అది పూర్తిగా ఫేక్ వీడియో అని తన ఎక్స్ ఖాతా వేదికగా ట్వీట్ చేశారు. ఇటువంటి వెకిలి చేష్టలతో ఆర్టీసి పరువు, ప్రతిష్టలు దిగజార్చడం సరికాదని హితవు పలికారు. లైక్‌లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా అనాలోచిత పనులను ఇతరులు అనుకరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సరదా కోసం చేసే ఎడిటెడ్ వీడియోలు ఇతరుల ప్రాణాలకు హాని కలిగిస్తాయని తెలిపారు. ఇటువంటి ఘటనలను టిజిఎస్‌ఆర్టీసి యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంటుందని, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సజ్జన్నార్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News