- Advertisement -
హైదరాబాద్: 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న రైలు లో నుంచి జారి పడ్డ యువకుడు ఎలాంటి గాయాలు కాకుండా ప్రాణాలతో బయట పడ్డ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహాన్ పుర్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న పాటలీపుత్ర ఎక్స్ ప్రెస్ రైలు షాజహాన్ పుర్ ర్రైల్వే స్టేషన్ వద్దకు రాగానే ఓ ప్రయాణికుడు ప్రమాదవశాత్తు ప్లాట్ ఫాం పై జారిపడ్డాడు. సుమారు వంద మీటర్ల వరకు రైలుతో పాటు జారుకుంటూ ముందుకెళ్లాడు. ఈ ఘటన రైల్వే స్టేషన్ లోని సిసిటివి కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ ఘటనలో యువకుడికి ఎలాంటి గాయాలు లేదు.
- Advertisement -