Monday, January 20, 2025

ప్రేమించలేదని గొంతు కోశాడు

- Advertisement -
- Advertisement -

Young man slits throat Young woman for rejecting love

హన్మకొండలో దారుణం

ఎంసిఎ చదువుతున్న అనూష
ఇంట్లో ఒంటరిగా ఉండడం
చూసి ప్రేమించాలని ఒత్తిడి
చేసిన అజర్ నిరాకరించడంతో
గొంతుకోసిన యువకుడు
ఎంజిఎంలో చికిత్స
పొందుతున్న అనూష ఐదు
గంటల్లో నిందితుడిని
అదుపులోకి తీసుకున్న పోలీసులు

మన తెలంగాణ/ఎంజిఎం (వరంగల్): యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేసి గొంతుకోసిన ఘటన శుక్రవారం జిల్లా కేంద్రం హన్మకొండలో చోటుచేసుకుంది. వెళ్తే.. నర్సంపేట పరిధిలోని లక్నెపల్లి గ్రామానికి చెం దిన అనూష(23) కాకతీయ యూనివర్సిటీలో ఎంసిఎ తృతీయ సంవత్సరం చదువుతుంది. యువతి చదువు నిమిత్తం ఆమె కుటుంబం హ న్మకొండ పోచమ్మగుడి సమీపంలోని గాంధీనగర్‌లో ఉంటున్నారు. కాగా, ప్రేమ పేరుతో అనూషను అజార్ అనే యువకుడు కొంతకాలంగా ఇబ్బందిపెడుతూ వస్తున్నాడు. అతడి ప్రతిపాదనను అనూష తిరస్కరిస్తూనే వస్తోంది. దాంతో ఆమెపై అజార్ కక్ష పెంచుకున్నాడు. ఇలా ఉండగా, గ్రూప్స్ శిక్షణ నిమిత్తం రెండు నెలలుగా అనూష హైదరాబాద్‌లో ఉండి కోచింగ్ తీసుకుంటూ వారంవారం హన్మకొండలోని ఇంటికి వస్తున్నది. అనూష ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న అజార్ శుక్రవారం ఉదయం ఇంట్లో అమె ఒక్కత్తే ఉన్నట్లు నిర్ధారించుకొని తనను ప్రేమించాలని పట్టుబట్టాడు. అందుకు అమె నిరాకరించింది. ఘర్షణ జరిగింది. కోపోద్రికుడైన అజార్ కత్తితో అనూష గొంతుకోశాడు.

అనూష గట్టిగా కేకలు వేసింది. బైట నుంచి ఇంటికి వచ్చిన అనూష తల్లి కుమార్తె పరిస్థితి చూసి ఆందోళనతో కేకలు వేయడంతో.. స్థానికులు గమనించి అనూషను వెంటనే 108 వాహనంలో ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. అనూష తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. అజార్ ఫోన్ నెంబర్ ఆధారంగా ఘటన జరిగిన ఐదు గంటల్లోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి చేయడానికి గల కారణాలపై అజార్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. చికిత్స పొందుతున్న అనూష ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఎంజిఎం ఆస్పత్రి కార్యనిర్వహణ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రస్తుతం యువతిని అబ్జర్వేషన్‌లో ఉంచామని, న్యూరో సర్జరీ, జనరల్ సర్జన్, ఈఎన్‌టి వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎంజీఎం వైద్యులు వెల్లడించారు. ముగ్గురు వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని.. 48 గంటల పాటు అబ్జర్‌వేషన్‌లో ఉంచుతామని వైద్యులు తెలిపారు.

ఆరా తీసిన గవర్నర్ తమిళిసై

విద్యార్థినిపై ప్రేమోన్మాది జరిపిన దాడి విషయమై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడి ఎంజిఎంలో చికిత్స పొందుతున్న అనూష ఆరోగ్య పరిస్థితిపై సూపరింటెండెంట్‌తో ఫోన్‌లో మాట్లాడిన గవర్నర్ అనూష పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అనూషకు తగిన వైద్యం అందిస్తున్నట్లు వివరించిన సూపరింటెండెంట్.. నిపుణులైన వైద్యులతో ఉన్నతస్థాయి బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ప్రేమోన్మాది దాడిపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌లో త్రీవంగా స్పందించారు. ఘటనకు బాధ్యడైన యువకుడిపై చర్య రీత్యా చర్య తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బాధితురాలు అనూషకు మెరుగైన వైద్యం అందించాలని ఎంజిఎం వైద్యులకు సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News