Saturday, November 23, 2024

ప్రియురాలు ఇంటి ముందు ప్రియుడు గన్‌తో హల్‌చల్

- Advertisement -
- Advertisement -

Young man stand in his lover house with gun

 

జైపూర్: ప్రియురాలు తనతో కలిసి జీవించాలని ఆమె ఇంటి ముందు ప్రియుడు గనతో హల్‌చల్ చేసిన సంఘటన రాజస్థాన్‌లోని ధోల్ఫూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆకాశ్ గుర్జార్ అనే యువకుడు గత కొంత కాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. యువతి మాత్రం అతడి ప్రేమను తిరస్కరిస్తూనే ఉంది. యువతి ఇంటి ముందు నిలబడి తనతో ఆమెను పంపించాలని లేకపోతే గన్‌తో కాల్చి చంపుతానని ఆమె కుటుంబ సభ్యులను బెదిరించాడు. యువతి తనకు దక్కకపోతే గన్‌తో కాల్చుకొని చనిపోతానని బెదిరించడంతో ఆమె తండ్రి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని అతి కష్టం మీద అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతికి గతంలో ఓ వ్యక్తితో నిశ్చితార్థం అయినప్పుడు ఆమెను కిడ్నాప్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News