Sunday, December 22, 2024

గర్ల్ ఫ్రెండ్‌తో పెళ్లి… తుపాకీతో కాల్చుకొని యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

జైపూర్: గర్ల్ ఫ్రెండ్ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని 17 సంవత్సరాల యువకుడు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజస్థాన్ రాష్ట్రం బిల్వారా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. యశ్ వ్యాస్ అనే బాలుడు, గర్లఫ్రెండ్ ఒకే స్కూళ్లో చదువుతున్నారు. స్కూళ్లో ఉన్నప్పుడు ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. గర్ల్ ఫ్రెండ్‌కు మరో వ్యక్తితో ఆమె తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయం చేశారు.

దీంతో యశ్ మానసికంగా కుంగిపోయాడు. వెంటనే తుపాకీ తీసుకొని కాల్చుకున్నాడు. అతడు తుపాకీతో కాల్చుకున్న దృశ్యాలు అక్కడ ఉన్న సిసి కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ఉదయ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకునే ముందు అతడు తన ప్రియురాలు మరో పెళ్లి చేసుకుందని పోస్టు చేశాడు. భిల్వారా పోలీస్ అధికారి నరేంద్ర ద్యామ్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News