Tuesday, January 21, 2025

యువకుడి ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ధర్మపురిః మండలంలోని నాగారం గ్రామంలో కనుకుల జలంధర్(25) అనే యువకుడు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నాగారం గ్రామానికి చెందిన జలంధర్ వడ్రంగి పనులు చేస్తూ జవనం సాగిస్తున్నాడు. ఆయన గత శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి బోజనం చేసి ఇంట్లోనే నిద్రించాడు.

శనివారం ఉదయం వారు నిద్ర లేచే సరికి జలంధర్ ఇంట్లో కనిపించలేదు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన ఆచూకి కోసం గత రెండు రోజుల నుండి గాలిస్తున్నారు ఈ క్రమంలో సోమవారం ఉదయం గ్రామశివారులోని బావిలో జలంధర్ శవమై కనిపించాడు. ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అందరితో కలివిడిగా ఉండే జలంధర్ మృతితో నాగారం, కమలాపూర్ గ్రామాల్లో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మెరకు పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News