మనతెలంగాణ/హైదరాబాద్: ప్రేమించిన యువతి మోసం చేసిందని మనస్థాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పాతబస్తీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… పాతబస్తీ, ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన జమాల్ చష్మలోని మోసిన్ అనే టైలర్ వద్ద పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే మోసిన్‌ను ఇంటి వద్ద కూరగాయలు, నిత్యావసర వస్తువులు తన ఇంట్లో ఇచ్చి రమ్మని తరచూ పంపేవాడు. మోసిన్ కుటుంబ సభ్యులతో చనువు ఏర్పడింది. మోసిన్ కుమార్తెతో జమాన్ ప్రేమలోపడ్డాడు. ఈ విషయం మోసిన్ కుటుంబ సభ్యులకు తెలియడంతో జమాల్‌ను మందలించారు. అప్పటి నుంచి యువతి జమాల్‌తో మాట్లాడడం ఆపివేసింది.
ప్రేమించిన యువతి తనను మోసం చేసిందని జమాల్ శనివారం అర్థరాత్రి డిజిల్ క్యాన్‌తో యువతి ఇంటికి వెళ్లాడు. యుతితో మాట్లాడేందుకు చాలా సేపు ప్రయత్నించాడు. అయినా ఫలితం లేకపోవడంతో జమాల్ ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో జమాల్ అక్కడికక్కడే మృతిచెందాడు. జమాల్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఫలక్‌నూమా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
young man suicide in Old City in Hyderabad