Monday, January 27, 2025

అనుమానాస్పదంగా యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

రాజంపేటః కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో ఆదివారం ఉద్రిక్తత వాతవరణం నెలకోంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దాపూర్ గ్రామానికి చెందిన కట్ల రాజు (35) అనే యువకుడు శనివారం గ్రామానికి చెందిన పచ్చంటి సత్తయ్య తన వ్యవసాయ పోలానికి పనుల నిమిత్తం తీసుకెళ్ళాడని పనులు ముగించిన అనంతరం చేపలు పట్టడానికి మరో ఇద్దరితో స్థానిక చెరువులోకి వెళ్ళారని అక్కడి నుండి మరల గ్రామానికి చెందిన సంగీరాంతో కలసి కల్లు సేవించారు అక్కడ మాట మాట పెరిగి గోడవ పడ్డారని తదనంతరం. సాయత్రం వరకు రాజు ఆచూకి కనిపించలేదన్నారు. ఆదివారం ఉదయం స్థానిక చెరువులో రాజు మృతదేహాం కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, బంధువులు గ్రామానికి చెందిన పచ్చంటి సత్తయ్య మరో ఇద్దరితో కలసి చంపివేసి చెరువులో పడివేశారని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకోని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించాలని బందువులకు సూచించారు.గ్రామస్తులు మాత్రం కావాలనే రాజును చంపివేశారని ఆగ్రహాంతో గ్రామానికి చెందిన పచ్చంటి సత్తయ్యపై దాడి చేసినట్లు తెలిసింది. రాజును చంపిన వారిని గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం వరుకు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో పోలీసులు నిందుతులకు అండగా ఉన్నారని అరోపిస్తూ మృతదేహాన్ని పోస్టుమార్టంకు వెళ్ళకుండా అడ్డుకోని పోలీస్ స్టేషన్ ముందు మృతదేహాంతో ఆందోళన చేశారు. దీంతో పోలీసులకు, గ్రామస్తులకు మద్య ఘర్షన వాతవరణం చేసుకుంది. తమకు న్యాయం జరిగే వరకు తాము మృతదేహాన్ని ఇవ్వమని తిరిగి గ్రామానికి తరలించారు. పోలీసులు ట్రాక్టర్‌కు అడ్డుతగిలిన ఎంత నచ్చ చెప్పిన వారు వినిపించుకోలేదు. ఈ విషయం తెలసుకున్న బిక్కనూర్ సిఐ తరుపయ్య రాజంపేట్ చేరుకోని పరిస్థితిని చక్కదిద్దారు.

పూర్తి వివరాలతో తమకు పిటిషన్ ఇస్తే తాము విచారణ జరిపి న్యాయం చేస్తామని అనుమానితులను అదుపులో తీసుకుంటామని చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు. తండ్రి కట్ల బాలయ్య ఇచ్చిన పిర్యాదు మెరకు కేసు నమోదు చేసుకున్నమని ధర్యాప్తూ చేస్తున్నామని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించామని సిఐ తెలిపారు. మృతుడికి బార్య ఇద్దరు చిన్నారులు ఉన్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News