Monday, December 23, 2024

కొండ చీలికలో చిక్కుకున్న యువకుడి కథ సుఖాంతం

- Advertisement -
- Advertisement -


పాలక్కాడ్ : కేరళలో మలప్పుజ సమీపంలో రెండు రోజులుగా కొండ చీలికలో చిక్కుకున్న యువకుని కథ సుఖాంతమైంది. భారత సైన్యం చేపట్టిన సహాయ చర్యలు ఫలించడంతో అతడికి ప్రమాదం తప్పింది. ఇటీవల కేరళకు చెందిన ఆర్. బాబు ఇద్దరు మిత్రులతో కలిసి మలప్పుజ సమీపం లోని కొండ శిఖరం ఎక్కే ప్రయత్నం చేశాడు. మిగతా ఇద్దరు మధ్యలోనే వెనక్కువెళ్లినా బాబు మాత్రం విజయవంతంగా శిఖరం వరకు చేరుకున్నాడు. అయితే ఉన్నట్టుండి కిందకు జారి కొండ చీలిక వద్ద చిక్కుకున్నాడు. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు చర్యలు చేపట్టినప్పటికీ అతడివరకు చేరుకోలేక పోయాయి. దాంతో గత రెండు రోజులుగా అతడు తిండి, నీరు లేక ఒంటరిగా అక్కడే గడపాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ చొరవతో భారత ఆర్మీకి చెందిన సదరన్ కమాండ్ బుధవారం రంగం లోకి దిగి అతడిని ప్రాణాపాయం నుంచి కాపాడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News