- Advertisement -
రంగారెడ్డి: కాబోయే భార్యతో కారులో వెళ్తుండగా ఐదుగురు యువకులు వారితో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హయత్ నగర్ కు చెందిన వంశీ కృష్ణ మార్చి 18న తనకు కాబోయే భార్యతో కలిసి కారులో వెళ్తున్నారు. ఐదుగురు యువకులు బైక్ లపై వచ్చి వారితో అసభ్యంగా ప్రవర్తించారు. వాళ్లను భయబ్రాంతులకు గురి చేశారు. కారుపై ఇద్దరు దుండగులు కూర్చొని వాహనం అద్దాలు పగులగొట్టారు. కారు ముందు భాగం కనపడకపోవడంతో రెండు బైకులను ఢీకొట్టాడు. వెంటనే వంశీ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -