Monday, December 23, 2024

ఉద్యోగాలు లేక మగపిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదు

- Advertisement -
- Advertisement -

ముంబై: బిజెపి అధికారంలో ఉన్న కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఉద్యోగాలు లేక మగపిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదని, ఉగ్యోగాల కల్పనలో ప్రభుత్వాల వైఫల్యం వల్ల సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయని పవార్ వ్యాఖ్యానించారు. బుధవారం నాడిక్కడ ఎన్‌సిపి చేపట్టిన జన జాగరణ యాత్రను పవార్ ప్రారంభిస్తూ ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అసలైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కులాల మధ్య వైరాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

దేశంలో వ్యవసాయ దిగుబడులు పెరగడం వల్ల ఆకలి సమమస్యను తీర్చడం సమస్య కాదని, కాని దళారీల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వాలు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా దేశంలో ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయని ఆయన ఆరోపించారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలను కోరే హక్కు ఉందని ఆయన అన్నారు. మహారాష్ట్ర నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని, మనుగడలో ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవని ఆయన అన్నారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు బడా వ్యాపారవేత్తలకు అవకాశాలు లభించడం లేదని ఆయన తెలిపారు. దీంతో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News