జూబ్లీహిల్స్‌లోని హెచ్ అండ్ ఎం షాపింగ్‌మాల్‌లో సంఘటన
ఇద్దరు యువకులు, స్టోర్ మేనేజర్ అరెస్టు
హైదరాబాద్ : ట్రయల్ రూంలో యువతి దుస్తులు మార్చుకుంటుండగా ఇద్దరు పోకిరీలు వీడియో తీయడం కలకలం సృష్టించింది. ఇద్దరు యువకులు, స్టోర్ మేనేజర్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం….నగరంలోని జూబ్లీహిల్స్‌లో రోడ్డు నంబర్ 36లోని హెచ్ అండ్ ఎం షాపింగ్‌మాల్‌కు వెళ్లిన యువతి కొత్త డ్రస్ ట్రయల్ చూసుకునేందుకు ట్రయల్ రూముకు వెళ్లింది. అదే సమయంలో పక్కన ఉన్న జంట్స్ ట్రయల్ రూముకు ఇద్దరు యువకులు కిరిట్ అసాట్, గౌరవ్ కళ్యాణ్ వచ్చారు. యువతి దుస్తులు మార్చుకుంటుండగా పైనుంచి ఫోన్ కెమెరా ఆన్ చేసి వీడియో రికార్డు చేశారు. ఇది గమనించిన యువతి ఒక్కసారిగా కేకలు వేసింది. దీంతోఅక్కడ ఉన్న వారు ఇద్దరు యువకులను పట్టుకున్నారు. తర్వాత డయల్ 100కు ఫోన్ చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు వెంటనే షాపింగ్‌మాల్‌కు చేరుకున్నారు.
ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న మొబైల్‌లోని వీడియోను డిలీట్ చేయించారు. మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని పరిశీలించగా అందులో ఇలాంటి వీడియోలు మరిన్ని ఉన్నాయి. ఇవి గతంలో ఇద్దరు కలిసి తీశారా లేక ఇంటర్‌నెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిర్లక్షంగా వ్యవహరించిన షాపింగ్ మాల్ మేనేజర్ ఆమన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్షంగా వ్యవహరించినందుకు మేనేజర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు జూబ్లీహిల్స్ ఎస్సై నరేష్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.