Monday, December 23, 2024

జాతరలో అమ్మాయిలకు బలవంతంగా ముద్దు పెట్టి….

- Advertisement -
- Advertisement -

Young mens kissing to Girls in Madhya pradesh

భోపాల్: జాతరలో గుంపుగా వచ్చిన యువకులు ఇద్దరు అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన మధ్యప్రదేశ్‌లో అలిరాజ్‌పూర్ జిల్లా సోండ్వా తెహసీల్‌లోని వాల్పూర్ గ్రామంలో జరిగింది.  ప్రతి సంవత్సరం గిరిజనులు భగోరియా జాతరను అంగరంగా వైభవంగా జరుపుకుంటారు. మార్చి 11న జనాలు తండోపతండాలుగా జాతరకు వచ్చారు. యువకులు గుంపుగా వచ్చి జాతరలో బీభత్సం సృష్టించారు. యువకులు అల్లరి చేస్తుండగా ఇద్దరు అమ్మాయిలు భయంతో ముందుకు వెళ్లిపోతున్నారు. పోకిరి వచ్చి అమ్మాయిని పట్టుకొని పక్కకు లాగడంతో పాటు లైంగికంగా వేధించాడు. మరో వ్యక్తి రెండో అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అందరూ వీడియోలు తీస్తున్నారే తప్ప ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారాయి. కాషాయం వస్త్రాలు ధరించిన వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని ఎస్ పి మనోజ్ కుమార్ సింగ్ తెలిపాడు. వీడియో ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News