Thursday, January 23, 2025

నగరంలో వీడ్ నడుస్తోంది…

- Advertisement -
- Advertisement -

Young people in Hyderabad are using hash oil

హైదరాబాద్: నగరంలోని యువకులు టెక్నాలజీని కాదు డ్రగ్స్‌లో కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నారు. గతంలో చాలామంది యువకులు, మిగతా వారు గంజాయిని సేవించేవారు. కాని పోలీసులు ఉక్కుపాదం మోపడంతో లభించడం కష్టంగా మారింది. దీంతో వెంటనే గంజాయి నుంచి తయారు చేసే వీడ్ లేదా హాష్ ఆయిల్‌ను వాడుతున్నారు. దీనిని రవాణా చేయడం సులభం కావడంతో ఎపిలోని విశాఖపట్టణం నుంచి నగరానికి సులభంగా తీసుకుని వస్తున్నారు. వీడ్ అరకులో తక్కువ ధరకు ఉండడంతో అక్కడికి వెళ్లిన వారు సులభంగా కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. వీడ్ రూ.1,000లకు 5గ్రాములు లభిస్తుండడంతో కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చి అవసరం ఉన్న వారికి రూ.2,000లకు విక్రయిస్తున్నారు. యువత ఎక్కువగా దీనికి బానిసగా మారి తాము తీసుకోవడమే కాకుండా నగరానికి తీసుకుని వచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇందులో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. ముషీరాబాద్‌కు చెందిన ఐదుగురు యువకులు గంజాయికి బానిసలుగా మారారు. గతంలో గంజాయి తీసుకోవడంతో వారికి వీడ్ గురించి తెలిసింది.

దానిని సిగరేట్లలో కలిపి తీసుకునేవారు, ఇది సులభంగా ఉండడంతో దానినే కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా అరకు నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తే డబ్బులు వస్తాయని ప్లాన్ వేశారు. డిగ్రీ చేస్తున్న యువకుడు అరకు వెళ్లి హాష్ ఆయిల్‌ను కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చి రూ.2,000లకు విక్రయిస్తున్నాడు. చిలకలగూడకు చెందిన ఐదుగురు యువకులను పట్టుకుని వారి వద్ద నుంచి రూ.2.40లక్షలు విలువైన హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో ఎస్‌ఆర్ నగర్ పోలీసులు వీడ్ ఆయిల్‌ను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.6.80లక్షల విలువైన హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితులు అరకు లంబసింగి నుంచి రూ.800, రూ.1,000లకు కొనుగోలు చేసి ఇక్కడ అవసరం ఉన్న వారికి రూ.1,500, రూ.2,000లకు విక్రయిస్తున్నారు. పోసులు డ్రగ్స్‌సై ఉక్కుపాదం మోపుతుండడంతో ఆష్ ఆయిల్ విక్రయించడం కష్టంగా మారింది. కొనుగోలు దారుల కోసం వెతుకుతుండగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

రవాణా సులభం…

వీడ్ ఆయిల్‌ను అరకు నుంచి రవాణా చేయడం సులభం కావడంతో చాలామంది హైదరాబాద్‌కు తీసుకుని వస్తున్నారు. గంజాయిని తీసుకుని రావాలంటే చాలా చెక్‌పోస్టులు దాటి పోలీసుల కళ్లుగప్పి తీసుకురావాల్సి ఉంటుంది. ఇది ఇబ్బందిగా మారింది, ఇటీవల కాలంలో పోలీసులు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపడంతో స్మగ్లర్లు వెనుకడుగు వేస్తున్నారు. ఆష్ ఆయిల్‌ను నిందితులు బ్యాగుల్లో పెట్టుకుని బస్సులు, రైళ్లలో తీసుకుని వస్తున్నారు. ఒక బాటిల్‌లో సులభంగా తీసుకుని వచ్చే అవకాశం ఉండడంతో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంది. అరకు నుంచి లీటర్లలో కొనుగోలు చేసి తీసుకుని వచ్చి చిన్న బాటిళ్లలో ఆయిల్‌ను నింపి అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నారు.

పోలీసుల ఉక్కుపాదం…

తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు డ్రగ్స్, గంజాయి, ఆష్ ఆయిల్ విక్రయిస్తున్నవారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో పోలీసులు దాడులు చేస్తుండడంతో గంజాయికి బదులుగా వీడ్ ఆయిల్ ఎక్కువగా లభిస్తోంది. దీనిని ఎక్కువగా గతంలో తీసుకున్న వారే రవాణాదారులకుగా మారి విక్రయిస్తున్నారు. గంజాయికి బానిసలుగా మారిన వారు దానిని కొనుగోలు చేయడానికి డబ్బులు లేకపోవడంతో విక్రయదారులుగా మారుతున్నారు. ఇందులో ఎక్కువగా డిగ్రీ చేస్తున్న విధ్యార్థులు ఉన్నారు. వీరు గంజాయి, వీడ్‌కు బానిసలుగా మారి వాటిని తయారు చేసే వారు తక్కువ ధరకు విక్రయిస్తారని తెలుసుకుని వారి వద్దకు వెళ్తున్నారు. అక్కడికి వెళ్లి తక్కువ ధరకు కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చి ఇక్కడ అవసరం ఉన్న వారికి ఎక్కువ ధరకు విక్రయించడమే కాకుండా వారు తీసుకుంటున్నారు. దీంతో వీరికి హాష్ ఆయిల్‌ను కొనుగోలు చేయకుండాను వారికి లభిస్తుండడంతో చాలామంది విధ్యార్థులు దీనివైపు మొగ్గుచూపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News