Tuesday, January 21, 2025

Minister Vemula: మంత్రి వేముల సమక్షంలో యువకుల చేరిక

- Advertisement -
- Advertisement -

లింగంపేట్ : కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలానికి చెందిన పలువురు యూత్ సభ్యులు అదివారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురెందర్, జహీరాబాద్ ఎంపి బీబీ పటిల్ సమక్షంలో బారాసా పార్టీలో చేరినట్లు పార్టీ మండల అద్యక్షుడు దివిటి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారిని పార్టీ కండువాలు కప్పి స్వాగతించారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తేరాసా ప్రభుత్వ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి యువకులు పార్టీలో చేరినట్లు తెలిపారు.

దేశంలో రాష్ట్రంలోనూ లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలువుతున్నాయని వాటిని చూసి పెద్ద సంఖ్యలో వివిద పార్టీలకు చెందిన కార్యకర్తలు బారాసాలో చేరుతున్నారని చెప్పారు. యూత్ నాయకులు సునీల్, అరుణ్, వేణుగౌడ్, సాయికుమర్, దుర్గాప్రసాద్, తే, వంశీ, ఉమేష్, ప్రవీణ్, జీవన్, జయపాల్ తో పాటు 30 మంది యూత్ సభ్యులు గాంధారిలో జరిగిన ఆత్మీయ సమేళనం కార్యక్రమంలో పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. నాయకులు సుప్పాల సందీప్, లింగంపేట్ విండో చైర్మన్ దేవెందర్ రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అద్యక్షుడు బండి రాజయ్య, మాజి ఎంపిపి ముదాం సాయిలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News