Sunday, July 7, 2024

ఫుల్ జోష్‌లో యువ ఆటగాళ్లు..

- Advertisement -
- Advertisement -

ముంబై: జింబాబ్వేతో జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు యువ ఆటగాళ్లతో కూడిన జట్టును బిసిసిఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. శనివారం ప్రారంభమయ్యే సిరీస్ కోసం భారత క్రికెటర్లు ఇప్పటికే జింబాబ్వే బయలుదేరి వెళ్లారు. ఈ సిరీస్‌లో పాల్గొనే జట్టుకు శుభ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. కాగా, భారత జట్టులో నలుగురు కొత్త ఆటగాళ్లకు చోటు దక్కింది. ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని నలుగురు క్రికెటర్లు ఈ సిరీస్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించనున్నారు.

వీరిలో అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, హర్షిత్ రాణా, సాయి సుదర్శన్, తుషార్ పాండేలు ఉన్నారు. వీరిలో రియాన్, అభిషేక్, తుషార్‌లు ఇప్పటికే జింబాబ్వే చేరుకున్నారు. మిగతా వారు కాస్త ఆలస్యంగా అక్కడికి చేరుకుంటారు. అభిషేక్, తుషార్, హర్షిత్ రాణాలు ఇటీవల ముగిసిన ఐపిఎల్‌లో అద్భుత ఆటతో అలరించిన విషయం తెలిసిందే. దీంతో వీరికి జింబాబ్వేలో పర్యటించే భారత జట్టులో స్థానం లభించింది. కాగా, టీమిండియాలో చోటు దక్కడంతో యువ ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అందివచ్చిన అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో వీరున్నారు. అభిషేక్, హర్షిత్ రాణాలు ట్విటర్ వేదికగా తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News