Friday, January 10, 2025

యువ రేసర్ శ్రేయస్ దుర్మరణం

- Advertisement -
- Advertisement -

చెన్నై: భారత క్రీడా రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. యువ బైక్ రేసర్ శ్రేయస్ హరీశ్ 13 ఏళ్ల వయసులోనూ దుర్మరణం పాలయ్యాడు. బెంగళూరుకు చెందిన బైక్ రేసర్ శ్రేయస్ చెన్నై వేదికగా జరిగిన జాతీయ మోటార్ సైకిల్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. పోల్ పొజిషన్‌తో రన్‌ను ప్రారంభించిన శ్రేయస్ మెరుపు వేగంతో దూసుకెళ్తున్న సమయంలో అతని బైక్ టర్న్1 మలుపు వద్ద అదుపు తప్పింది.

దీంతో శ్రేయస్ కిందకు పడిపోయాడు. ఈ సమయంలో బైక్ మెరుపు వేగంతో ఉండడంతో కింద పడిపోయిన శ్రేయస్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. 13 ఏళ్ల చిరు ప్రయంలోనే యువ బైక్ రేసర్ అకాల మరణం పొందడం భారత క్రీడారంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. బెంగళూరు కిడ్‌గా పేరు తెచ్చుకున్న శ్రేయస్‌కు చిన్నప్పటి నుంచే మోటార్ సైకిల్ రేసింగ్ అంటే ఎంతో ఇష్టం. చిన్న వయసులోనే అతను రేసింగ్‌ను క్రీడాంశంగా మలుచుకున్నాడు.

కొద్ది సమయంలోనే అతను భారత్‌లోని ప్రముఖ బైక్ రేసర్లలో ఒకడిగా పేరుతెచ్చుకున్నాడు. భారత్‌లోనే కాకుండా విదేశాల్లో జరిగిన పలు ప్రముఖ బైక్ రేసింగ్ పోటీల్లో పాల్గొని సత్తా చాటాడు. ఇటీవలే అతర్జాతీయ రేసుల్లో పాల్గొని భారత్‌కు చేరుకున్నాడు. అయితే స్వదేశంలో జరిగిన బైక్ రేసులో పాల్గొంటూ దుర్మరణం పాలయ్యాడు. చిన్న వయసులోనే అతను మృత్యువాత పడడం అందరిని కలచి వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News