Tuesday, November 5, 2024

అరుదైన గౌరవంగా భావిస్తున్నా: మను బాకర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన యువ షూటర్ మను బాకర్ విశ్వక్రీడల ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. భారత హాకీ స్టార్ శ్రీజేశ్‌తో కలిసి మను బాకర్ ముగింపోత్సవంలో భారత్ పతాకధారిగా వ్యవహరించింది. దీనిపై తాజాగా మను బాకర్ స్పందించింది. ఒలింపిక్స్ వంటి మెగా క్రీడల్లో జాతీయ జెండాను చేతబూని ముందుకు సాగే అవకాశం రావడం చాలా గర్వంగా ఉందని పేర్కొంది. దీన్ని తన జీవితంలోనే అత్యంత అరుదైన గౌరవంగా అభివర్ణించింది.

ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్లలో ఎంతో మంది తనకంటే మెరుగైన స్థితిలో ఉన్నారని, అయినా వారిని కాదని తనకు పతాకధారిగా ఛాన్స్ దక్కడం ఎంతో ఆనందం కలిగించిందని వివరించింది. ఇక పారిస్ ఒలింపిక్స్ తనకు చాలా ప్రత్యేకమని తెలిపింది. ఒలింపిక్స్ పతకాల కోసం తామంతా ఎంతో కష్టపడ్డామని, అయితే ఈ విషయంలో కొందరికి నిరాశే మిగలడం ఎంతో బాధించిందని మను బాకర్ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, తాను ఈ క్రీడల్లో రెండు పతకాలు గెలుచుకోవడం సంతోషంగా ఉందని, రానున్న క్రీడల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఇది దోహదం చేస్తుందనే నమ్మకాన్ని మను వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News