Friday, December 27, 2024

యువ విద్యార్థులను ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దాలి

- Advertisement -
- Advertisement -

ఓయూలో పరిశోధన మెలుకువలపై మొదటి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో పలువురు వక్తల వెల్లడి

మన తెలంగాణ/ హైదరాబాద్:  తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి శాస్త్రీయ పరికరాలను బహిర్గతం చేయడం సుసంపన్నమైన అనుభవమని సెంట్రల్ ఫెసిలిటీస్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ నిర్వహించిన మొదటి ‘ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఆన్ రీసెర్చ్ టెక్నిక్ కార్యక్రమంలో పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ముగింపు సెషన్‌లో పలువురు పాల్గొని తమ ఆలోచనలు విద్యార్థులకు వివరించారు.

ఈసందర్భంగా నిజాం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి. భీమా మాట్లాడుతూ యువ విద్యార్థులను ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దాలని, ఆర్జించిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని శాస్త్రీయ పరిణామాలను నిరంతరం అప్‌డేట్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. సైన్స్‌లో ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్‌లో అపూర్వమైన మార్పులు వస్తున్న నేపథ్యంలో ఇది చాలా కీలకమని పిఎఫ్‌ఆర్‌డి డైరెక్టర్ ప్రొపెసర్ సందీప్త పేర్కొన్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌ను సందర్శించి వారం రోజుల పాటు చేపట్టిన కార్యక్రమాలను ఆమె వివరించారు. ఇటువంటి ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలు పాల్గొనేవారి ఉపాధిని పెంచుతాయని తెలిపారు. అనంతరం ప్రొఫెసర్ బి.మంజుల ప్రసంగిస్తూ ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు సమస్యలపై పూర్తి స్పష్టత ఉండాలని, తమ లక్ష్యాలను సాధించేందుకు ఉత్సాహంగా కృషి చేయాలని కోరారు.

ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ హమీదా బీ, అక్టోబర్ 11న పోస్ట్ పాండమిక్ సినారియో ఇంపెండింగ్ వైరస్ రీసెర్చ్ అనే అంశంపై జరగనున్న నేషనల్ సెమినార్‌లో మైక్రోబయాలజీ, ఓయూ విభాగంలో రాబోయే ప్రోగ్రామ్ వివరాలను తెలియజేశారు. హెచ్‌సిడిసి డైరెక్టర్ ప్రొఫెసర్ కె. స్టీవెన్‌సన్, పాల్గొనేవారు తమ బలాలు మరియు బలహీనతలను గుర్తించి శ్రేష్ఠత దిశగా కృషి చేయాలని గమనించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ రూపొందించిన కొత్త బ్రోచర్, సిఎఫ్‌ఆర్‌డిలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను వివరించే చిన్న వీడియోను ఈ సందర్భంగా విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News