Sunday, December 22, 2024

750 తూటాలతో పట్టుబడ్డ యువతి

- Advertisement -
- Advertisement -

బుధవారం వారణాసి నుంచి బీహార్ లోని చాప్రాకు వెళ్తున్న రైలులో 20 ఏళ్ల యువతి వద్ద 750 తూటాలు పట్టుబడడంతో బలియా రైల్వే పోలీస్‌లు అరెస్ట్ చేశారు. . 315 బోర్‌కు చెందిన 750 తూటాలతో ఆమె ప్రయాణిస్తోందని సమాచారం అందడంతో పట్టుకున్నామని బలియా రైల్వే పోలీస్ ఇన్‌ఛార్జి సుభాష్ చంద్ర యాదవ్ చెప్పారు. నిందితురాలు మానితాసింగ్ మీర్జాపూర్ జిల్లా నాదిహార్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని చెప్పారు.

ఆమె సంచిలో ఈ తూటాలు దొరికాయన్నారు. ఘాజిపూర్‌కు చెందిన అంకిత్‌కుమార్ పాండే, రోషన్‌యాదవ్ అనే ఇద్దరు ఈ తూటాలను చాప్రాకు ఇవ్వాలని పంపించినట్టు ఆమె పోలీస్‌ల దర్యాప్తులో పేర్కొంది. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. పాండే, యాదవ్‌లను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంతకు ముందు సెప్టెంబర్ 28 న బలియా రైల్వే స్టేషన్‌లోనే 825 తూటాలను పోలీస్‌లు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News