Sunday, December 22, 2024

ప్రియుడు మోసం చేశాడని పురుగుల మందు తాగిన యువతి

- Advertisement -
- Advertisement -

Young woman attempts suicide at nizamabad

నిజామాబాద్:  ప్రియుడు పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని మనస్తాపంతో ఓ యువతి పురుగులమందు తాగిన సంఘటన నిజామాబాద్ జిల్లాలోని నవీపేటలో బుధవారం చోటుచేసుకుంది. పురుగులమందు తాగిన బాధితురాలిని స్థానికులు నవీపేట ఆస్పత్రికి తరలించారు. యువకుడిపై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని యువతి ఆరోపిస్తోంది. పోలీసులు పట్టించుకోనందువల్లే యువతి ఆత్మహత్యాయత్నం చేసినట్టు పేర్కొంది. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News