Wednesday, January 22, 2025

క్రేబుల్ బ్రిడ్జిపై యువతి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఓ మహిళను మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు కాపాడారు. పోలీసుల కథనం ప్రకారం… ఓ మహిళ(25) కేబుల్ బ్రిడ్జిపై అనుమానస్పదంగా తిరుగుతుండడంతో పోలీసులు అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే మహిళ నిద్రమత్తు ట్యాబ్లెట్లు వేసుకుంది. దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు కేబుల్ బ్రిడ్జిపైకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మహిళను వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మహిళకు సంబంధించిన వారు నగరంలో ఎవరైనా ఉన్నారా అనే కోణంలో మాదాపూర్ పోలీసులు విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News