Tuesday, January 21, 2025

ఫ్రిజ్‌లో యువతి మృతదేహం భాగాలు

- Advertisement -
- Advertisement -

26 ఏళ్ల యువతి మృతదేహాన్ని ముఫ్పై ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో దాచి ఉంచిన సంఘటన బెంగళూరు లోని వ్యాలికావల్ ప్రాంతం అపార్టుమెంట్‌లో శనివారం బయటపడింది. ఆ ఫ్రిడ్జి ఉన్న భవనం నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీస్‌ల దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో పోలీస్‌లు రంగం లోకి దిగి తనిఖీ చేయగా ఫ్రిజ్‌లో మృతదేహం భాగాలు కనిపించాయి. ఎప్పుడో ఈ హత్య జరిగి ఉంటుందని శరీర భాగాలు ఫ్రిజ్‌లో దాచి ఉంచారని అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సతీష్ కుమార్ చెప్పారు. దర్యాప్తులో పోలీస్‌లకు కొన్ని వివరాలు తెలిశాయి. వాస్తవానికి మృతురాలు వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ, ఆమె బెంగళూరులోనే ఉంటున్నట్టు తెలిసింది.

డాగ్‌స్కాడ్,ఫింగర్ ప్రింట్ టీమ్‌లను రప్పించి క్రైమ్‌సీన్‌లో సాక్షాధారాలు సేకరించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు కూడా పిలిచినట్టు సతీష్ కుమార్ తెలిపారు. పోలీస్‌లు మొదట అపార్టుమెంట్‌కు చేరుకుని చూసేసరికి 165 లీటర్, సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఆన్‌చేసి పనిచేస్తున్నట్టు కనిపించింది. అందులోని మృతదేహాన్ని చాలా వరకు క్రిములు తినేశాయని పోలీస్‌లు చెప్పారు. ఈ కేసు 2022లో ఢిల్లీలో జరిగిన 27 ఏళ్ల శ్రద్ధావాకర్ హత్య కేసును గుర్తుకు తెస్తోంది. శ్రద్ధావాకర్ శరీరాన్ని ఆమె బాయ్ ఫ్రెండ్ అఫ్తాబ్ అమీన్ పూనావాలా 35 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచి ఉంచిన సంఘటన సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News