Monday, December 23, 2024

కనుగుడ్లు తీసేసి కాళ్లు, చేతులను కోసి..

- Advertisement -
- Advertisement -

అత్యంత క్రూరంగా దారుణ హత్య

వికారాబాద్ జిల్లా కాళ్లాపూర్‌లో ఘోరం 
పోలీసుల అదుపులో మృతురాలు శిరీష, బావ అనిల్

పరిగి: యువతిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి నీటి కుంటలో పడేసిన సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని కాళ్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పరిగి ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం వివరాలీలా ఉన్నాయి. మండల పరిధిలోని కాళ్లాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన జుట్టు శ్రీకాంత్ చెల్లెలు జట్టు శిరీష (19) వికారాబాద్‌లోని మా శారద ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తుంది. శనివారం రాత్రి ఇంట్లో నాన్న తమ్ముడు చెల్లెలు తమ్ముడు శ్రీను బావ అనిల్‌కు ఫోన్ చేసి అక్క శిరీష అన్నం వండటం లేదని తెలుపగా అనిల్ వచ్చి శిరీషను మందలించాడు. దీంతో శీరిష పదిన్నర పదకొండు గంటల సమయంలో ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది.

ఉదయం ఆదివారం కాళ్లాపూర్ శివారులో గల గోనె మైసమ్మ గుడి వద్ద చెరువు కుంట నీళ్లలో శీరిష పడి ఉంది. శిరీషను రెండు కళ్లను పొడిచిన గాయాలు ఉండి రక్తం కారినట్లు ఉంది. కింది పెదవికి రక్తం కారి ఎడమ కాలుకు, ఎడమ మణికట్టుకు వద్ద గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. యువతి శరీరంపై గాయాలను బట్టి హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్ట్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు ఇంటర్ పూర్తి చేసుకుని పారామెడికల్ కళాశాలలో చేరినట్లు బంధువులు తెలిపారు. సొంత బావనే హత్య చేశాడా, గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News