Friday, December 20, 2024

మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం.. యువతి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: మలేషియాలో పని కల్పిస్తామని రాజంపేట గ్రామానికి చెందిన కోంతమంది ఆటోడ్రైవర్లు, యువకులకు వీసా ఇప్పిస్తానని డబ్బులు తీసుకోని మోసం చేసిన యువతిని బుధవారం అరెస్ట్ చేసినట్లు రాజంపేట ఎస్సై జి.రాజు తెలిపారు. అయన తెలిపిన వివరాల ప్రకారం… రాజంపేటకు చెందిన కోంతమంది అటోడ్రైవర్‌లకి మలేషియాలో ఉపాధి నిమిత్తం వీసా ఇప్పిస్తామని హైదరాబాద్‌లోని పీర్జాడిగూడకు చెందిన అల్లిమినటి శ్వేతారెడ్డి డబ్బులు తీసుకోని వీసాలు ఇవ్వకుండా మోసం చేసింది.

బాధితుల ఫిర్యాదు మేరకు రాజంపేట పోలీస్‌స్టేషన్ లో చీటింగ్‌కేసు నమోదు చేసి నిందుతురాలు అల్లిమినటి శ్వేతారెడ్డి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. అనంతరం కామారెడ్డి కోర్టులో హాజరు పరచగా నిందితురాలికి 14రోజుల రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. అదేవిదంగా మంగళవారం రోజున స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించి విధులకు అటంకపరిచిన వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News