Friday, November 22, 2024

ఖైరతాబాద్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

Young woman commits suicide attempt in Khairatabad

ఆస్పత్రిలో చికిత్స

మనతెలంగాణ, హైదరాబాద్ : ఫ్లైఓవర్‌పై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన నగరంలోని ఖైరతాబాద్‌లో ఆదివారం చోటుచేసుకుంది. యువతికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. జీడిమెట్లకు చెందిన చందన(22) రెండేళ్ల క్రితం నరేష్ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరు కలిసి ఖైరతాబాద్‌లో ఉంటున్నారు. చిన్న విషయానికి కూడా బాగా ఆలోచించే చందన రెండేళ్లు అవుతున్నా తల్లిదండ్రులు తమ ప్రేమ వివాహాన్ని అంగీకరించలేదని, ఇప్పటి వరకు తమ వద్దకు రాలేదని తరచూ బాధపడుతుండేది. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం బస్సులో వచ్చి ఖైరతాబాద్‌లో దిగి బ్రిడ్జిపై నుంచి నడుచుకుంటూ వెళ్లి కిందకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు స్పందించి సైఫాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు యువతిని ఆస్పత్రికి తరలించారు. యువతికి కాలు విరిగిందని, స్పైనల్ కార్డు దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్థుతం యువతికి ఎలాంటి ప్రమాదం లేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సైఫాబాద్ ఎస్సై రవి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News