Monday, December 23, 2024

ఫోన్ చూస్తున్నందుకు పెద్దమ్మ మందలించిందని యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

తరచూ సెల్ ఫోన్ చూస్తున్నందుకు పెద్దమ్మ మందలించిందని మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కయంజాల్ లో చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు చెందిన మానేపల్లి కృష్ణ, శ్రీదేవి దంపతుల కూతురు మానేపల్లి శ్రావణి ఇటీవల తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్ లో నివాసం ఉంటున్న తన పెద్దమ్మ పద్మావతి ఇంట్లో ఉంటుది. కంప్యూటర్ కోర్సు నేర్చుకునేందుకు దిల్ సుఖ్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఇనిస్ట్యూట్ లో జాయిన్ అయ్యింది. గురువారం ఉదయం శ్రావణి సెల్ ఫోన్ చూస్తుండగా పెద్దమ్మ మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన, శ్రావణి సాయంత్రం తుర్కయంజాల్లోని మాసబ్ చెరువులో దూకింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని చేపలు పట్టే వారి సహాయంతో యువతిని గుర్తించి బయటకు తీశారు. అప్పటికే ఆమె మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News