Monday, December 23, 2024

చెరువులో పడి యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ : చెరువులో పడి యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ పట్టణం వెంకట్రామిరెడ్డి కాలనీకి చెందిన సదుల స్వప్న(19) మేడ్చల్ చెక్‌పోస్టులోని రాణే ఇంజన్ వాల్వ్ కంపెనీలో పనిచేస్తుంది. కాగా మంగళవారం ఉదయం హనుమంతుడి గుడికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లింది. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో స్వప్న ఫోన్‌కు ఆమె తండ్రి నర్సింలు ఫోన్‌చేయగా వేరే వ్యక్తి ఫోన్ లేపి మేడ్చల్ పెద్ద చెరువులో పడిపోయినట్లు తెలిపారు. మేడ్చల్ పెద్ద చెరువుకు చేరుకున్న స్వప్న తండ్రి స్వప్న మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News