Wednesday, September 25, 2024

యూట్యూబర్ హర్షసాయిపై యువతి ఫిర్యాదు.. రేప్ కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: యూ ట్యూబర్‌గా యువతరానికి దగ్గరైన హర్షసాయిపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తనని మోసం చేశాడని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. అడ్వోకేట్‌తో సహా నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఆమె హర్ష సాయితో పాటు అతడి తండ్రిపైనా ఫిర్యాదు చేసింది. నెటిజన్లకు సుపరిచితమైన హర్షసాయి హీరోగాను మారాడు. స్వీయ దర్శకత్వంలో ‘మెగా’ అనే చిత్రం ద్వారా వెండితెరపైకి అడుగుపెడుతున్నాడు.

మరోవైపు, హర్షసాయిపై రేప్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అత్యాచారంతో పాటు నగ్నచిత్రాలు, వీడియోలతో బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడినట్లు యువతి ఫిర్యాద చేయడంతో హర్షసాయిపై 376(2), 376ఎన్, 354 సెక్షన్ల కింద రేప్ కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ డిసిపి వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News