Wednesday, January 22, 2025

క్రాస్‌వీల్ నుంచి కిందపడి యువతి మృతి

- Advertisement -
- Advertisement -

తిరుపతి: క్రాస్‌వీల్ నుంచి కిందపడి యువతి మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. లోకేశ్వరి(25), గౌతమి(24) అనే స్నేహితులు తిరుపతిలో ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఎంజాయ్ చేయడానికి శిల్పారామం వెళ్లారు. క్రాస్ వీల్ ఇద్దరు కూర్చున్నారు. క్రాస్ వీల్ తిరుగుతుండగా ఆది పైకి వెళ్లిన తరువాత ఊడి పిడింది. లోకేశ్వరి తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే చనిపోయింది. గౌతమి తీవ్రంగా గాయపడడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కూర్చీలో ఒకరే కూర్చోవాల్సి ఉండగా అందులో ఇద్దరు కూర్చోవడంతో పాటు అతడి తుప్పు పట్టిపోవడంతో కిందపడిపోయినట్టు సమాచారం. పోలీసులు నిర్వహకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రాస్‌వీల్‌లో కూర్చీలన్నీ తుప్పు పట్టిపోయాయని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News