Thursday, January 23, 2025

నీళ్లు తోడుతూ బావిలో పడి యువతి మృతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/వరంగల్ కార్పొరేషన్: నగరంలోని 29వ డివిజన్ రామన్నపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కాపరబోయిన ప్రణీత(23) తన ఇంట్లో బావిలో నీళ్లు తోడుతూ జారి పడి మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఈసంఘటనకు సంబంధించి మట్టెవాడ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రామన్నపేటకు చెందిన కాపరబోయిన రవి-స్వరూప దంపతులు మహబూబాబాద్ జిల్లాలో తన సోదరుడి ఇంట్లో జరిగే బొడ్రాయి ఉత్సవాలకు శనివారం వెళ్లారు. ఆదివారం ఉదయం రవి వెళ్లాడు. దీంతో రవి-స్వరూపల కూతురు ప్రణీత ఇంటివద్దనే ఒక్కతే ఉన్నట్లు తెలిపారు. అనంతరం ఆదివారం సాయంత్రం స్నానం చేసేందుకు తమ ఇంట్లో ఉన్న బావిలో నీళ్లు తోడేందుకు ప్రణీత ప్రయత్నించగా బకెట్ తాడు తెగి బావిలో పడిపోయి మృతిచెందినట్లు తెలిపారు. అనంతరం రవి చిన్నతమ్ముడు శ్యాం ప్రణీత క్షేమ సమాచారం కోసం ఇంటికి రాగా ప్రణీత ఎక్కడ కనిపించకపోవడంతో మహబూబాబాద్‌లో ఉన్న తన అన్నయ్యకు సమాచారం ఇచ్చారు.

అనంతరం బావిలో వంగి చూడగా ప్రణీత అప్పటికే బావిలో మృతిచెందినట్లు గుర్తించి చుట్టూపక్కల వారికి సమాచారం ఇచ్చాడు. అనంతరం పోలీస్‌లు, ఫైర్ సిబ్బందికి సమాచారం తెలియడంతో అదేరోజు రాత్రి ప్రణీతను ఫైర్ సిబ్బంది బయటకు తీసినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న అన్న రవి వదినె స్వరూపలు వచ్చినట్లు తెలిపారు. సోమవారం ఉదయం మట్టెవాడ ఎఎస్సై సంపత్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఎంజిఎం ఆస్పత్రికి తరలించి అనంతరం శవాన్ని తల్లిదండ్రులకు అప్పగించి దర్యాప్తు చేస్తున్నట్లు మట్టెవాడ సిఐ రమేష్ తెలిపారు. కాగా రవి-స్వరూప దంపతులకు ఇద్దరు కూతుర్లు కాగా పెద్ద కూతురు గౌతమి, రెండవ కూతురు ప్రణీతలని తెలిపారు. రెండవ కూతురు ప్రణీత మృతితో ఆకుటుంబం శోకసంద్రంగా ఉండడం పలువురిని కంటతడి పెట్టించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News